నేటి గద్దర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
పార్లమెంట్ ఎన్నికల అనంతరం 500 రూపాయలు బోనస్ ఇస్తానని ఇప్పుడు వంకలు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ కి ప్రజలు బుద్ధి చెప్పటం ఖాయం అని BRS జిల్లా నాయకులు వనమా రాఘవ అన్నారు.రాఘవ ఆధ్వర్యంలో గురువారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు 500 రూపాయల బోనస్ వెంటనే చెల్లించాలి అని వనమా రాఘవ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, ఎంపీపీలు బాదావత్ శాంతి, బుఖ్య సోనా, మండల పార్టీ అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, ప్రధాన కార్యదర్శి బొమ్మిడి శ్రీకాంత్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఉపసర్పంచ్ లు, పట్టణ, మండల కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల సభ్యులు, మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
