నేటి గద్ధర్ న్యూస్,ఆంద్రప్రదేశ్ (పాడేరు):
ఈనెల 19 20 21 తేదీలలో జరగనున్న శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవ జాతరలో భాగంగా పాడేరు పట్టణంలో ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా విశాఖపట్నం నుండి పాడేరు చేరుకునే బస్సులు చెక్ పోస్ట్ నుండి తుంపాడ, సన్యాసమ్మ పాలెం, ఆడారిమెట్ట మీదగా పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ కు చేరుకుంటాయని జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత తెలిపారు. గురువారం బస్సుల డైవర్షన్ కోసం సంబంధిత అధికారులతో రోడ్ సర్వే జరిపిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణంలో ఎట్టి పరిస్థితులలో ట్రాఫిక్ అంతరాయం కలగరాదని అదేవిధంగా ప్రయాణికులు, భక్తులు దర్శనం సజావుగా చేసుకోవడానికి వీలుగా పాడేరుకు బస్సులు నడపాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బస్సు రూటు లో గల అడ్డమండ వద్ద ఆర్ అండ్ బి అధికారులు మరమ్మతులు చేసిన కాజ్ వేను పరిశీలించారు. బస్సులు తిరగటానికి వీలుగా కాజ్ వే కు మిగిలిన చిన్న చిన్న మరమ్మతులను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ రూట్ సర్వేలో కలెక్టర్ తో పాటు ఆర్టీసీ డిపో మేనేజర్ వి శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి పర్యవేక్షక ఇంజనీర్ బాల సుందర బాబు, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, ఆర్ అండ్ బి
ఏ ఈ లు తదితరులు పాల్గొన్నారు.
