కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ దే
★ బీఆర్ఎస్ ప్రభుత్వం కొలువులిస్తే.. తామే ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పాలకు లు
★ మాయ మాటలు చెప్పే వారికి బుద్ధి చెప్పండి
★ఎమ్మెల్సీ ఎన్నికల్లో BRS అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కి మద్దతు గా నిలబడండి
★ ఉన్నత విద్యావంతుడు రాకేష్ రెడ్డి
★ ప్రశ్నించే గొంతుక అవుతాడు
★ యువ నాయకుడు రాకేష్ రెడ్డి ని శాసన మండలికి పంపిద్దాం
★నేడు మణుగూరు కిన్నెర కళ్యాణ మండపం లో ఉ దయం 10 గంటల కు BRS ఎమ్మెల్సీ సమావేశం
★హాజరు కానున్న BRS Mlc అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి
★BRS భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్
నేటి గద్ధర్ న్యూస్, పినపాక :నేడు మణుగూరు కిన్నెర కళ్యాణ మండపం లో ఉ దయం 10 గంటల కు BRS ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం నిర్వహించడం జరుగుతుందని , ఈ సమావేశానికి ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి హాజరవుతారని భద్రాద్రి కొత్తగూడెం BRS అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం పినపాక లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
త్వరలో జరగనున్న Mlc ఎన్నికల్లో వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ని పట్టాభద్రుడు భారీ మెజార్టీతో గెలిపించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ కోరారు. ఎన్నో ఏళ్లుగా గత పాలకుల చేతిలో నిర్లక్ష్యానికి గురైన వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేసిన సుమారు 11 వేల కాంట్రాక్టు ఉద్యోగస్తులను మాజీ సీఎం KCR పర్మినెంట్D చేయడం జరిగిందన్నారు. అలాగే 40 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన ఘనత కెసిఆర్ కి దక్కుతుందన్నారు. ఈ అంశాలను విద్యావంతులు పరిగణలోకి తీసుకొని కెసిఆర్ కి మద్దతు తెలపాలని కోరారు.వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రతిష్టాత్మక Bits pilani లో ఉన్నత విద్యను పూర్తి చేయడమే కాకుండా గూగుల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీల్లో ఉద్యోగం చేసిన అనుభవం ఉందన్నారు. అలాంటి యువ నాయకున్ని ఎన్నుకుంటే మూడు జిల్లాల పరిధిలోని యువకులకు ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాల కల్పనకు కృషి చేయడంతో పాటు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక అవతారని కోలేటి అన్నారు. పట్టభద్రులు రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.
