ఏఓ రామగుడు వాణి..
నేటి గద్ధర్ న్యూస్, పాలేరు,( మే 16):
కూసుమంచి మండలంలోని ముత్యాలగూడెం గ్రామంలో రైతులకు వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిణి రామడుగు వాణి మాట్లాడుతూ.. రైతులందరూ నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాలలో ఇంటింటికి తిరిగి ఎవరైనా గుడ్డ సంచులలో కానీ, నకిలీ లేబుల్ తో ఉన్న ప్యాకెట్లలో కానీ విత్తనాలు అమ్మినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి వారి వద్ద విత్తనాలు తీసుకోవద్దని, లైసెన్స్ కలిగిన అధికృత డీలర్ నుండి మాత్రమే విత్తనాలను తీసుకోవాలని సూచించారు. పంట కాలం పూర్తయ్యే వరకు బిల్లును జాగ్రత్తపరచుకోవాలని సూచించారు. గ్రామాలలో ఎవరైనా అనుమతి లేకుండా విత్తనాలు అమ్ముతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని సూచించారు. అనంతరం వేసవిలో లోతు దుక్కులు చేయడం వలన భూమి లోపల పొరల్లో ఉన్న పురుగుల యొక్క అవశేషాలను నశింప చేయొచ్చని తెలిపారు. పచ్చిరొట్ట పైర్ల వల్ల కలిగే ఉపయోగాలను రైతులకు వివరించారు. మట్టి పరీక్ష నమూనాలను ఏ విధంగా సేకరించాలి, మట్టి పరీక్ష ఫలితాల విశ్లేషణ గురించి తెలియజేశారు. అనంతరం వరి పంట అవశేషాలను తగలబెట్టడం ద్వారా జరిగే అనర్ధాలు గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి కిరణ్మయి రైతులు పాల్గొన్నారు.
