కనీస వేతనాలకు నోచుకోని కాంట్రాక్ట్ కార్మికులు…
నేటి గద్దర్ ప్రత్యేక ప్రతినిధి మే 16:
నైనారపు నాగేశ్వరరావు ✍️
7893538668
తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి బొగ్గు గనుల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కాంట్రాక్టు కార్మికుల శ్రమ ద్వారా లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్న,కాంట్రాక్టు కార్మికుల స్థితిగతులో మాత్రం ఎలాంటి మార్పు లేదు. వారి కుటుంబాలు ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్నాయి.కాంట్రాక్ట్ కార్మికుల రక్త మాంసాలను చిందించి ప్రభుత్వాలకి ఆదాయాన్ని సమకూర్చుతున్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్ట్ కార్మికుల శ్రమదోపిడిని దోచుకోవడమే తప్ప వారి కనీస వేతనాల విషయంలో దృష్టి సారించకపోవడం వలన వారి కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నాయి. సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు మరియు పర్మినెంట్ కార్మికుల కంటే ఎక్కువగా కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు.కానీ సింగరేణి ఉద్యోగులు మరియు పర్మినెంట్ కార్మికుల జీతభత్యాలతో పోల్చుకుంటే కాంట్రాక్టు కార్మికుల వేతనాలు 15% కూడా రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వాలు చేసినటువంటి కనీస వేతన చట్టాలను కూడా అమలుకు నోచుకోకపోవడం లేదు.ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కనీస వేతన చట్టాలు అమలు కాకపోవడం వలన కార్మిక కుటుంబాలు అర్థాకలితో అలమటిస్తున్నారు.
సింగరేణి బొగ్గు గనులో కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ దోపిడీకి కారకులు ఎవరు..? అంటూ కార్మికులు ఆరోపిస్తున్నారు.కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు కూడా మా కనీస వేతన చట్టాల గురించి పట్టించుకునే పరిస్థితి లేదని మనోవేదనకు గురవుతున్నారు.
వివరాల్లోకి వెల్లితే…
తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి బొగ్గు గనులు 11 డివిజన్లుగా ఏర్పడి ఉన్నాయి. మణుగూరు,కొత్తగూడెం,ఇల్లందు,సత్తుపల్లి, భూపాలపల్లి,రామగుండం,మందమర్రి,శ్రీరాంపూర్,బెల్లంపల్లి,కోనేటి,రామకృష్ణాపూర్ ప్రాంతాల్లో ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు నడుస్తున్నాయి.ఈ 11 డివిజన్లో సుమారుగా 30 వేల మంది ఓబి కంపెనీలలో కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు.సిం⁹గరేణి ఓబి ప్రైవేటు కంపెనీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల గ్రేడ్లను పరిశీలిస్తే, నాలుగు దొంతర్లుగా ఉన్నాయిô. అవి 1 అన్ స్కిల్డ్,2 సెమీ స్కిల్డ్,3 స్కిల్డ్,4 హైలీ స్కిల్డ్ ఈ నాలుగు రకాల పద్ధతుల్లో ప్రైవేటు కంపెనీలలో కాంట్రాక్టు కార్మికులు పనులు చేస్తున్నారు.aఈ నాలుగు రకాల పద్ధతుల్లో ప్రైవేటు కంపెనీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు రూ – 21,223/-వేల నుండి రూ -46,923/- లు వరకు రావాల్సి ఉంటుంది.కానీ వీరికి వివిధ కంపెనీలలో 12 వేల నుండి 21 వేల లోపు కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు ఇస్తున్నారు.
జీవో నెంబర్ 22 కు గెజిట్ చేయని పక్షంలో గెజిట్ నెంబర్ 67 తేది:30-01-2024, జీవో ఆర్ టి నెం 94 తేది:29-01-2024 కు క్రింది సవరణల ప్రకారం షెడ్యూల్ క్యాటగిరిలో హైలీ స్కిల్డ్ 1,2,3,4 ప్రకారం మరియు స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్ స్కీల్డ్ ఉన్నాయి.బేసిక్ వేజ్ కాలం 3 ప్రకారం హైలీ స్కిల్డ్ 1 కు రూ – 46,923/- లు, హైలీ స్కిల్డ్ 2 కు రూ – 41,526/- లు, హైలీ స్కిల్డ్ 3కు రూ – 36,750/- లు, హైలీ స్కిల్డ్ 4 కు రూ – 32,520/- లు,స్కిల్డ్ కు రూ – 27,781/- లు, సెమీ స్కిల్డ్ కు రూ – 25,470/- లు,అన్ స్కిల్డ్ కు రూ – 21,223/- లు నిర్ణయించి ఉన్నాయి. హైలి స్కిల్డ్ 3 అంటే ఓబీల్లో పనిచేస్తున్న వాల్వ డ్రైవర్లు,ఆపరేటర్లకు పైన తెలిపిన జీవో ప్రకారం 36,750 రూపాయలు ఇవ్వవలసి ఉండగా వారికి 21 వేల రూపాయల లోపు ఇచ్చి వారి శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారు.వీటిని అమలు చేయకపోవడం కాకుండా ఓబి కంపెనీలలో పనిచేస్తున్న కాంటాక్ట్ కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ అందరికీ సక్రమంగా ఇవ్వకపోవడం దారుణమని కార్మికుల ఆరోపిస్తున్నారు.
సింగరేణి ప్రైవేటు కంపెనీలో 8 గంటలు మాత్రమే కార్మికులు పనిచేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని చోట్ల పది గంటల నుండి 12 గంటల వరకు కాంట్రాక్ట్ కార్మికులతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నటువంటి పరిస్థితులు దాపరించాయి.సింగరేణి ఓబి ప్రైవేటు కంపెనీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితులపై,వారి వేతనాలపై ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన సింగరేణి యాజమాన్యం పట్టించుకోకపోవడం వలన సింగరేణి ఓబీ కంపెనీల కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.ఎవరైనా కార్మికుడు మేము 8 గంటల డ్యూటీ మాత్రమే చేస్తాము.10 నుంచి 12 గంటలు అదనంగా డ్యూటీ ఎందుకు చేయాలని కాంట్రాక్టర్ ని నిలదీస్తే వారిపై జులుం ప్రదర్శిస్తున్నారు. దాడులకి దిగడం,అదే కాకుండా వారిని డ్యూటీ నుండి తొలగిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి.
కనీస వేతనాలకు నోచుకోని కాంట్రాక్ట్ కార్మికులు…
సింగరేణి ఓబి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకి జీవో నెంబర్ 22 గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ పనులు చేసే వారికి కనీస వేతనం 18000 ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఆ కార్మికులకు 10 నుండి 12,000 వేల వరకే వేతనాలు ఇస్తున్న పరిస్థితి ఉంది.అదే కాకుండా స్కిల్డ్, హైల్వి స్కిల్డ్ పనులు చేసే కార్మికులకు కనీస వేతనం 29 వేల వరకు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఎవరికీ కూడా ఆ వేతనాలు వచ్చే పరిస్థితి లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు.సింగరేణి కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు మరియు పర్మినెంట్ కార్మికుల కంటే ఎక్కువగా శ్రమ చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు కాకపోవడం దారుణమని పలువురు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కాంట్రాక్ట్ కార్మికులకు ఎన్నికల మాస్టర్ కూడా ఇవ్వకపోవడం దారుణమని కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి ఓబి కాంట్రాక్టర్లు కార్మికులను శ్రమదోపిడి చేస్తున్నారని కనీస వేతనాలు కూడా అమలు చేయడం లేదని ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల జీతభత్యాలపై దృష్టి సారించాలని పలువురు కాంట్రాక్ట్ కార్మికులు కోరుతున్నారు.సింగరేణి ఓబి ప్రవేట్ కంపెనీల కాంట్రాక్టర్లపై సింగరేణి యాజమాన్యం పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలు కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు,మేధావులు పలువురు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు.