నేటి గద్ధర్ న్యూస్,కరకగూడెం:విద్యుత్ ఘాతంతో దుక్కిటెద్దు మృతి చెందిన సంఘటన కరకగూడెం మండలం కలవల నాగరం లో చోటు చేసుకుంది.ప్రత్యక్ష సాక్షులు, బాధిత రైతు ఇస్లావత్ రాధాకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.గ్రామంలో ఉన్న మిని ట్రాన్స్ఫార్మర్ నుండి సపోర్టు తీగకు విద్యు త్ సరఫరా జరగడంతోనే దుక్కిటెద్దు మృతి చెంది ఉంటుందని సమాచారం. వర్షాకాలం నెత్తిమీదికి రావడంతో, ఇప్పుడే దుక్కిటెద్దు మృతి చెందడంతో రైతు బోరున విలపించాడు. ఈ దుక్కిటెద్దు సుమారు 40 వేలు విలువచేస్తుంది. ఈ నిరుపేద ఆదివాసి గిరిజన రైతుకు ఆర్థిక సాయం అందించి తన వ్యవసాయానికి తోడ్పడాలని అధికారులను వేడుకుంటున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కుటుంబ సభ్యులు కోరారు.
Post Views: 117