+91 95819 05907

ఉపాధ్యాయుల బదిలీలకు సర్కార్ అంగీకారం

నేటి గద్ధర్ వెబ్ డెస్క్:

హైదరాబాద్‌, మే16 ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, బదిలీ అయిన వారి రిలీవ్‌కు షెడ్యూల్‌ విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపిందని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.
గురువారం ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నేతృత్వంలో ప్రతినిధుల బృందం సీఎంను కలిసి పాఠశాలల పునః ప్రారంభానికి ముందే విద్యారంగ సమస్యలు పరిషరించాలని కోరామని పేర్కొన్నారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శితో చర్చించి నిర్దిష్టమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని సీఎం ఫోన్‌ ద్వారా ఆదేశించారని తెలిపారు.
తర్వాత సచివాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశంను కలిసి చర్చించినట్టు తెలిపారు. తమ ప్రతిపాదనలకు కార్యదర్శి అంగీకారం తెలిపారని, ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని బదిలీ అయి రిలీవ్‌ కాకుండా ఉన్న ఉపాధ్యాయులను వెంటనే విడుదల చేస్తామన్నారని తెలిపారు. సీఎం సూచన మేరకు సబంధిత శాఖల అధికారులతో చర్చిస్తానని తెలిపారని పేర్కొన్నారు. ఢిల్లీ మాడల్‌ను తెలంగాణలో అమలు జరపాలన్న తమ వినతి మేరకు ఉపాధ్యాయ సంఘాల నేతలను పాఠశాలల సందర్శనకు ఢిల్లీ తీసుకెళ్లే ఆలోచన ఉందని తెలిపారని పేర్కొన్నారు. సమావేశంలో యూఎస్పీసీ, జాక్టో నాయకులు కే జంగయ్య, వై అశోక్‌ కుమార్‌, టీ లింగారెడ్డి, సదానందంగౌడ్‌ పాల్గొన్నారు.

విద్యాశాఖ ఉన్నతాధికారులపై చర్య తీసుకోవాలి: పీఆర్‌టీయూటీఎస్‌

టెట్‌ విషయంలో సరైన సమాచారాన్ని అందించకుండా ఉపాధ్యాయులను గందరగోళానికి గురిచేసిన పాఠశాల విద్యా కమిషనర్‌ దేవసేన, అదనపు సంచాలకులు లింగయ్యపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పీఆర్‌టీయూటీఎస్‌ డిమాండ్‌ చేసింది. కార్యాలయంలో అందుబాటులో ఉండకుండా ఉపాధ్యాయ సమస్యలను పట్టించుకోకుండా పలు అక్రమాలకు పాల్పడిన వీరిపై విచారణ చేపట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని గురువారం విద్యాశాఖ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను ఆ సంఘం నేతలు కోరారు. గతంలో నిలిచిపోయిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను వెంటనే చేపట్టాలని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ప్రభుత్వం స్వాధీనపరచుకొని ప్రభుత్వ బోర్డులు పెట్టిన భూములకు రక్షణ ఏది ?అన్నవరపు

◆సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరం కనకయ్య మణుగూరు20: సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం కామ్రేడ్ ఉత్తమ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవర పు కనకయ్య

Read More »

ఇద్దరు యువకులు మృతి చెందిన కుటుంబాలకు గ్రామస్తులంతా కలసి సహకారం.

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) ఏప్రిల్ 20. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని పోతన్ శెట్టిపల్లి గ్రామంలోని ఇటీవల ఇద్దరు యువకులు మరణించిన విషయం తెలిసిందే కాగా పోతాంశెట్టిపల్లి గ్రామస్తులందరూ కలిసి

Read More »

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… !!!

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… అప్పటి నుండి కుటుంబ వ్యవస్థ చెడుదారిపట్టింది…!! అప్పట్లో మంచి చెడు చెప్పడానికి ప్రతి కుటుంబంలో పెద్దలు ఉండేవారు…!! ఆ పెద్దలు పిల్లలకు సమాజంలో చెడు నుండి దూరంగా

Read More »

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి, తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు బట్టీవిక్రమార్క చొరవతో ఈ రోజు పాతర్లపాడు గ్రామ పెంటి నర్సమ్మ కి సీఎం రిలీఫ్ ఫండ్ 21000 రూపాయలు అందించటం జరిగింది.

Read More »

అశ్వారావుపేటలో 2.32 కోట్లు విలువైన గంజాయి పట్టివేత

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 20: అశ్వారావుపేటలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీలో తరలిస్తున్న రూ. 2.32 కోట్లు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్న అశ్వరావుపేట పోలీసులు. ముగ్గురు

Read More »

ఏప్రిల్ 20, 21 న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి సత్తుపల్లి, భద్రాచలం పర్యటన

*ఏప్రిల్ 20 షెడ్యూల్* 4.00pm – RJC క్రిష్ణ గారి పరామర్ష, కాలువ ఒడ్డు, ఖమ్మం 4.30pm – గట్టు కరుణ గారి కుమారుడి రిసెప్షన్ (గ్రాండ్ గాయత్రి హోటల్, వైరా రోడ్డు, ఖమ్మం)

Read More »

 Don't Miss this News !