★ BRS కార్యకర్త కుటుంబానికి రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చెక్ అందజేత
నేటి గద్ధర్ న్యూస్,పినపాక: బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు.శుక్రవారం మణుగూరు మండలం బండారి గూడెం కిన్నెర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధిత కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు ఇన్సూరెన్స్ చేయడం ద్వారా మంజూరైన చెక్కును శుక్రవారం అందజేశారు.వివరాలు ఇలా ఉన్నాయి. పినపాక మండలం రాయి గూడెం గ్రామానికి చెందిన చిట్టి మల్ల సురేష్ ఇటీవలే మృతి చెందాడు. బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోవడం ద్వారా అతనికి ఆ పార్టీ ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మంజూరైన రెండు లక్షల ఇన్సూరెన్స్ చెక్కు ను మృతుని భార్య చిట్టిమల్ల రమకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల BRS పార్టీ అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి,ఎంపీపీ గుమ్మడి గాంధీ,బీ.ఆర్.ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్,నాయకులు పటేల్ భద్రయ్య ,MPTC కాయం శేఖర్, వెంకటేశ్వర రెడ్డి, బూర రమేష్ గౌడ్,సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.