◆ Mlc ఇండిపెండెంట్ అభ్యర్థి గుగులోత్ సంతోష్ నాయక్.
నేటి గద్దర్ న్యూస్,ములుగు ( మే 17) :
ములుగు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టభద్రులను కలిసి ఈనెల 27 వ తారీఖు నాడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పకుండా నా క్రమసంఖ్య 51వ నెంబర్ గూగుల్ సంతోష్ నాయక్ గారి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అన్నారు.ఈ సమావేశాన్ని ఉద్దేశించి సంతోష్ నాయక్ గారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి చాలామంది పట్టబద్రులు చదివి ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ నిరుద్యోగులను కూలీలుగా మారుస్తున్నారని ఈ పార్టీలకు స్వస్తి పలికి నాకు అవకాశం ఇస్తే తప్పకుండా మీ సమస్యలను నా సమస్యలుగా పరిగణలోకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడుతూ పట్టభద్రులందరికీ న్యాయం జరిగే విధంగా నా యొక్క కార్యచరణ ప్రణాళిక ఉంటుందని పార్టీలు కాకుండా ఇండిపెండెంట్ గా మీకోసం నీ యొక్క భవిష్యత్తు కోసం వస్తున్నానని ఆ దిశగా మన యొక్క లక్ష్యం,ఆలోచన ఉండాలని మాట్లాడారు. వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలో ఉన్న పట్టభద్రులందరూ తప్పక నాకు అవకాశం కల్పిస్తే భవిష్యత్తులో మీకోసం పోరాటం చేయడానికి మరియు అహర్నిశలు కష్టపడడానికి ముందుంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో *జాటోత్ గణేష్,లావుడ్యి రమేష్,ఆజ్మీర బావ్ సింగ్,రాహుల్,చంటి పాడ్య,తులసిరాం,వినోద్, పవన్,కిషోర్, లక్ష్మణ్, రమేష్,తదితరులు* పాల్గొన్నారు.