★ అంగన్వాడీ టీచర్ మర్డర్ మిస్టరీ చేదించిన పోలీసులు
★ నిందితులను చాకచక్యంగా అరెస్టు చేసిన పోలీసులు
నేటి గద్ధర్ న్యూస్,ములుగు:
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటపూరు గ్రామంలోని అంగనవాడీ సెంటర్ 3లో విధులు నిర్వహిస్తున్న రడం సుజాత (50) మంగళవారం హత్యకు గురైన సంఘటన విధితమే.హత్య చేసిన నిందితులను పస్రా DSP రవీందర్ రెడ్డి అధ్వర్యంలో పట్టుకున్నారు.డిఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.వాజేడు మండలం రొయ్యురు గ్రామనికి చెందిన ఆకుదారి.రామయ్య,పడిగ.జంపయ్య,అను ఇద్దరు వ్యక్తులు పథకం ప్రకారం కాటపూరు గ్రామం నుండి వారి ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని నాంపల్లి గ్రామ సమీపంలోని అటవి ప్రాంతంలో గల నీల వర్రె దగ్గర హత్యచారం చేసి అమె మెడలో ఉన్న బంగారు ఆభరణాలు తిసుకోని స్కార్ప్ తో హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని తెలిపారు. తక్కువ సమయంలోనే అంగన్వాడీ టీచర్ హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులను మండల ప్రజలు అభినందించారు.