+91 95819 05907

ఉన్నత విద్యావంతుడు ఏనుగుల రాకేష్ రెడ్డి….నల్గొండ నయీమ్ తీన్మార్ మల్లన్న:రేగా కాంతారావు

★BRS నల్గొండ Mlc అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి
★వివాద రహితుడు…ప్రశ్నించే గొంతుక రాకేష్ రెడ్డి:రేగా
★మణుగూరు కిన్నెర కళ్యాణ మండపంలో లో BRS mlcఅభ్యర్థి విజయం కాంక్షిస్తూ సమావేశం
★హాజరైన ఏడు మండలాల BRS ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు

నేటి గద్ధర్ న్యూస్,మణుగూరు:BRS నల్గొండ Mlc అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఉన్నత విద్యావంతుడు, వివాద రహితుడు అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు.శుక్రవారం మణుగూరు మండలం బండారి గూడెం కిన్నెర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పినపాక నియోజకవర్గ BRS పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం భద్రాద్రి కొత్తగూడెం BRS పార్టీ అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ అధ్యక్షత నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు mlc అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు కు ఆ పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు. రాకేష్ రెడ్డి ని శాసన మండల కి పంపిస్తే ప్రశ్నించే గొంతుక అవుతారని అన్నారు. ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్ ని తప్పక కలిసి రాకేష్ రెడ్డి మూడవ నెంబర్ కి మొదటి ప్రాధాన్యత ఓటు అభ్యర్థించాలని సూచించారు. పార్టీ శ్రేణులు అందరూ ఐక్యంగా ముందుకు సాగాలన్నారు
🔥🔥🔥🔥🔥🔥🔥
బ్లాక్ మెలర్, నల్లగొండ నయీమ్ తీన్మార్ మల్లన్నకు బుద్ధి చెప్పాలి:రేగా

నల్లగొండ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ బ్లాక్ మెయిలర్ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మండిపడ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను తనను గెలిపించాలని బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నట్లు తన దగ్గర సమాచారం ఉందన్నారు. ఇలాంటి వ్యక్తి నీ శాసనమండలికి పంపిస్తే నిరుద్యోగులకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.

★తీన్మార్ మల్లన్న నాపై చేసిన భూకబ్జా ఆరోపణలు బేసరత్తుగా ఉపసంహరించుకోవాలి:రేగా

తీన్మార్ మల్లన్న తనపై గతంలో చేసిన భూకబ్జా ఆరోపణలు ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు డిమాండ్ చేశారు. మణుగూరు కి వస్తే తను కబ్జా చేసిన భూమి ఎక్కడ ఉందో విలేకరుల సమక్షంలో నిరూపించాలని అన్నారు. గిరిజన నాయకుడినైనా తనపై హైదరాబాద్ పినపాకలో భూకబ్జాలకు పాల్పడినట్లు అసత్య ప్రచారం చేసిన తీన్మార్ మల్లన్న నిరూపిస్తావా అని సవాల్ విసిరారు. ఇలాంటి బ్లాక్ మెయిలర్ ని ప్రజా ప్రతినిధిగా ఎన్నుకొని విద్యావంతులు తప్పు చేయొద్దని కోరారు.
★Mlc అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కి ఘన సన్మానం.
నల్లగొండ Mlc అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ని మణుగూరు BRS భవన్ లో రాజ్యసభ ఎంపీ రవిచంద్ర,బీ. ఆర్.ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ,ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ లో శాలువా తో ఘనంగా సన్మానించారు.
ఈ సమావేశంలో పినపాక నియోజకవర్గం లోని ఏడు మండలాల బీ.ఆర్.ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !