★ రూ. 50 వేల ఆర్ధిక సహాయం
★ బాధిత కుటుంబానికి చెక్కను అందజేసిన రేగా విష్ణు ట్రస్ట్ చైర్మన్ రేగా కాంతారావు
నేటి గద్ధర్ న్యూస్,మణుగూరు:
గత కొన్ని నెలల క్రితం ప్రమాదవశాత్తు ఓ నాలుగు సంవత్సరాల బాలుడు ఇంకుడు గుంతలో పడి మృతి చెందాడు. దీనితో ఆ కుటుంబం పుట్టెడు బాధ అనుభవిస్తుంది. దానికి తోడు వారిది కడు నిరుపేద కుటుంబం. వివరాలు ఇలా ఉన్నాయి. మణుగూరు మండలం గుట్ట మల్లరాం పంచాయతీ గనేబోయిన గుంపు కు చెందిన మట్టా వెంకటేశ్వర్లు, వెంకటమ్మ ల కుమారుడు మట్టా ధరమ్ తేజ్ (4) ప్రమాదవశాత్తు ఇంటి పక్కనే ఉన్న ఇంకుడు గుంతలు పడి మృతి చెందాడు .ఈ నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్న రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రేగా కాంతారావు చెల్లించి తోచిన ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. మణుగూరు కిన్నెర కళ్యాణ మండపంలో ఆ ట్రస్ట్ చైర్మన్ రేగా కాంతారావు బాధిత కుటుంబ సభ్యులు మట్ట వెంకటేశ్వర్లు, వెంకటమ్మ దంపతులకు రూ.50వేల చెక్కు ను అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.