– ప్రశ్నించే గొంతుక చట్టసభల్లో ఉండాలి
– ప్రముఖ అడ్వకేట్ సతీష్
నేటి గదర్, మే 18, బూర్గంపాడు / భద్రాద్రి కొత్తగూడెం :
చదువుకున్న విద్యావంతులందరూ నిరుద్యోగులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రముఖ అడ్వకేట్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన నాయకులు భజన సతీష్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రశ్నించే గొంతుక చట్టసభల్లో ఉంటే నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యావంతులు ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్, జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ ఓటర్లందరూ ఐక్యతను చాటుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయాలని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందించేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికులల పనిచేయాలని కోరారు. గత ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అలుపెరగని పోరాటం చేసిన వారిలో తీన్మార్ మల్లన్న ఒకరని కొనియాడారు. ఆయన గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని తెలియజేశారు.