నేటి గద్ధర్ న్యూస్ వెబ్ డెస్క్:
తెలంగాణలో గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు వచ్చాయి.
★అన్ని వర్గాల వారూ ఓట్లు వేసే సాధారణ ఎన్నికల కంటే.. అందరూ డిగ్రీ పైన చదువుకున్న వారు, పిల్లలకు పాఠాలు చెప్పే వారు ఓట్లు వేసే ఈ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చెల్లని ఓట్లు రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
★ తెలంగాణ రాష్ట్రంలోని ఓ నియోజకవర్గంలో 21 వేలకు పైగా చెల్లని ఓట్లు వచ్చాయి.
★మామూలు ఎన్నికల్లో వంద ఓట్లు ఉండి, ఒకరికి 100 రెండో వారికి 65, మూడో వారికి 40, నాలుగో వారికి 30 ఓట్లు వచ్చాయి అనుకుంటే.. అప్పుడు 100 ఓట్లు వచ్చిన మొదటి వ్యక్తి గెలిచినట్టు. కానీ ఇక్కడ ఆ మొదటి వ్యక్తికి వ్యతిరేకంగా 135 ఓట్ల వచ్చాయన్న విషయం మనం మర్చిపోతున్నాం. అంతేకాదు. కనీసం ఓటేసిన వారిలో సగం మంది కూడా ఆ వ్యక్తికి మద్దతు ఇవ్వలేదని అర్థం.
★★★★★★★★★★
★Mlc ఎన్నికల్లో ఓటు వేయడం ఎలా..?
★★★★★★★★★★
పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లిన వెంటనే జాబితాలో మీ పేరును అధికారులు తనిఖీ చేస్తారు. ఏదేని ఒక ఐడీ కార్డును చూసి.. ఓటును నిర్ధారించుకున్న తర్వాత లిస్టులో టిక్ పెడతారు. అనంతరం మీ చేతికి బ్యాలెట్ పేపర్‌తో పాటు పెన్ను ఇస్తారు
◆ బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థులందరి పేర్లు తెలుగు, ఆంగ్ల భాషల్లో రాసి ఉంటాయి. అభ్యర్థి పేరుకు ఎదురుగా గడీలు ఉంటాయి. అందులో మీకు నచ్చిన అభ్యర్థికి ప్రాధాన్యత సంఖ్యను వేయాల్సి ఉంటుంది.
◆ఖాళీ గడీల్లో ప్రాధాన్యత సంఖ్యను సాధారణ అంకెల్లో (1, 2, 3, 4) మాత్రమే రాయాల్సి ఉంటుంది. టిక్ మార్క్ పెట్టకూడదు. వేలి ముద్రలు, రోమన్ అంకెలు వేయకూడదు. అలా చేస్తే ఆ ఓటు చెల్లదు.
★పోలింగ్ కేంద్రంలో అధికారి ఇచ్చే ఉదా రంగు కలర్ స్కెచ్ పెన్‌తో మాత్రమే ప్రాధాన్యతా సంఖ్యను వేయాలి. మొదటి ప్రాధాన్యత ఓటును ఖచ్చితంగా వేయాలి. తర్వాత అభ్యర్థుల సంఖ్య వరకు ప్రాధాన్యత సంఖ్యను వేస్తూ వెళ్లవచ్చు.
◆ఓటు ప్రాధాన్యతను సూచించే క్రమంలో మధ్యలో ఒక అంకెను మినహాయించి, ఆ తర్వాత నుంచి కొనసాగించకూడదు. ఉదాహరణకు 1, 2, 3, 5, 6, 7, 8 ఇలా ప్రాధాన్యత ఇస్తేతే.. మధ్యలో ‘4’ మిస్ అయినందున 3 వరకే ప్రాధాన్యత క్రమాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
★ఒక్క అభ్యర్థికి ఒక్క ప్రాధాన్యత ఓటును మాత్రమే ఇవ్వాలి. ఒకరి కంటే ఎక్కువ మందికి ’1’ అని ఇస్తే ఆ ఓటును పరిగణలోకి తీసుకోరు. ఒక అభ్యర్థికి ఒకటి కంటే ఎక్కువ ప్రాధాన్యత అంకెలు ఇచ్చినా అది చెల్లదు.
◆బ్యాలెట్ పేపర్లో ఉన్న అభ్యర్థుల్లో ఎంత మందికైనా ఓటు వేసుకోవచ్చు. కేవలం ఒక్కరికి కూడా వేయవచ్చు. ఇద్దరు, ముగ్గురికి కూడా మద్దతు తెలపవచ్చు. కానీ ప్రాధాన్యత క్రమాన్ని మరవకూడదు.
మీ నియోజకవర్గంలో 71 మంది పోటీల్లో ఉంటే.. 71 మందికి ఓటు వేయవచ్చు. ఐతే 1 నుంచి 71 వరకు అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న గడీల్లో నెంబర్లను రాయాల్సి ఉంటుంది.
★ఏ ఎన్నికల్లోనైనా ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థిని గెలిచినట్టు ప్రకటిస్తారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ భిన్నంగా ఉంటుంది. మొత్తం చెల్లుబాటైన ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ వస్తేనే విజేతగా ప్రకటిస్తారు. ఒక అభ్యర్థికి 50 శాతం+1 వచ్చేదాకా.. 1,2,3 ప్రాధాన్య ఓట్ల కౌంటింగ్ జరుగుతూనే ఉంటుంది. ఉమ్మడి ఏపీతో పాటు, తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1వ ప్రాధాన్యత ఓటు లెక్కింపుతో ఎవరూ గెలవలేదు. 2వ ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం తేలింది.
గ్రాడ్యుయేట్స్ ఓటు వేస్తున్నప్పుడు తప్పక పై సూచనలు పాటించండి.