★గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించిన కరకగూడెం పోలీసు సిబ్బంది.
★గుడుంబా విక్రయాలు జరిపితే కఠిన చర్యలు: SI రాజేందర్
నేటి గద్దర్ కరకగూడెం: గుడుంబా స్థావరాలపై ఉక్కు పాదం మోపిన కరకగూడెం ఎస్ఐ రాజేందర్. తమ సిబ్బందితో గుడుంబా తయారు చేసే కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. గుడుంబా అమ్ముతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వివరాల్లోకి వెళితే కరకగూడెం మండలం కన్నాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని కలవాల్నాగారం అటవీ ప్రాంతంలో గుడుంబా తయారీ స్థావరాలపై కరకగూడెం ఎస్ఐ రాజేందర్ తమ సిబ్బందితో ఆకస్మిక దాడులు నిర్వహించారు. బట్టీలు పెట్టి గుడుంబా తయారు చేస్తుండగా వాటిని పట్టుకొని తమ సిబ్బందితో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజేందర్ మాట్లాడుతూ. మండలం లో ఎక్కడ గుడుంబా తయారు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఏజెన్సీ గ్రామాల్లో అమాయక గిరిజనలు గుడుంబా వల్ల తమ జీవితాలను కోల్పోతున్నారని దొంగ చాటుగా గుడుంబా తయారు చేస్తున్నారని సమాచారంతో కలవల అటు ప్రాంతంలో కాటన్ సెర్చ్ నిర్వహించగా గుడుంబా తయారీ స్థావరాలను గుర్తించామని ఆయన తెలిపారు. గుడుంబా తయారీదారులు అక్కడి నుంచి పారిపోయారని గుడుంబా తయారు చేసిన,అమ్మిన వారిపై పీడి యాక్ట్ కేసు నమోదు చేసి జైలుకు పంపియాల్సి వస్తుందని ఆయన తెలిపారు. గ్రామాలలో యువకులు మహిళలు గుడుంబా తయారీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎవరు తయారుచేసిన తమకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.