కాంగ్రెస్ పార్టీ పాల్వంచ మండల అధ్యక్షులు:గద్దల రమేష్
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి (పాల్వంచ)మే 18:
నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి, ప్రశ్నించే గొంతుక ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పాల్వంచ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు,మాజీ సర్పంచ్ గద్దల రమేష్ పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ,గత ప్రభుత్వంలో జరిగిన అరాచకలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు నిజమైన జర్నలిస్టుగా ప్రజలకు వివరించిన తీన్మార్ మల్లన్న ను కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఖమ్మం, నల్గొండ,వరంగల్,కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నియమించడం జరిగిందన్నారు. అదే విధంగా ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మండల పరిధిలోని ఉన్న ప్రతి గ్రామంలో పట్టభద్రులను గుర్తించి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త తీన్మార్ మల్లన్న గెలుపే ద్వేయంగా పార్టీ శ్రేణులు సైనికులా పని చేసి తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపు ఇచ్చారు.