నేటి గదర్ న్యూస్ , మే 18 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి):
పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మరో మారు తన దాతృత్వాన్ని చాటారు. ఇక వివరాలు ఇలా ఉన్నాయి.. తిరుమలయపాలెం మండలం రాజారం గ్రామంలో ఇటీవల గడ్డి మందు తిని దాదాపు 200 పైన గొర్రెలు చనిపోయిన విషయాన్ని స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న కందాళ ఉపేందర్ రెడ్డికి వెంటనే స్పందించి బాధితులతో చరావాణిలో వీడియోకాల్ మాట్లాడి వారికి తక్షణ సహాయంగా ఒక్కో గొర్రేకు ₹ 1000/- చొప్పున (సుమారుగా 2 లక్షల) రూపాయలు ప్రకటించి బాధితుల కుటుంబాలకు అండగా నిలిచారు..అలాగే ప్రభుత్వం నుండి సహాయం అందేవిధంగా చూస్తానని భవిష్యత్తులో అండాగా వుంటానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలు కందాళ ఉపేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.వారి వెంట బాణాల మధుసుధన్ రెడ్డి,కొప్పుల ఉపేందర్ రెడ్డి,రంగాపురం బాలకృష్ణ గౌడ్,పేర్ల కొమరయ్య,సంపత్,గణేష్,నరేష్,బిక్షం,సైదులు,నాగయ్య,వేల్పుల మల్లయ్య,టీ. రవీందర్ రెడ్డి,గుండాల సైదులు,జంపాల రమేష్,మందుల ఎల్లయ్య,శ్రీరంగం దినేష్,సామా వినయ్ రెడ్డి ఉన్నారు.