◆అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ
◆జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం మే 18:
పిఎస్ యు,ప్రభుత్వ రంగ సంస్థలు,ఏజెన్సీలు పేర్లులో
టిఎస్ బదులుగా టిజి గా మార్చాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు.ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర అబ్రియేషన్స్ సూచించే ‘టీఎస్’ స్థానంలో టీజీని వినియోగించేందుకు కేంద్రం అనుమతిస్తూ గెజిట్ జారీ చేసినట్లు తెలిపారు.మార్చి నెలలో వాహనాల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన అనుమతులు రాగా,తాజాగా అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో టీఎస్ కు బదులుగా టీజీని వినియోగించేందుకు అనుమతి జారి చేసినట్లు తెలిపారు.ఈ మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంస్థలు,పీఎస్ యులు,ఏజెన్సీల పేర్ల ముందు టిఎస్ కు బదులు టిజి గా మార్చాలని ఆదేశించారు.ఉదాహరణకు టీఎస్ఎన్పిడిసిఎల్ పేరును ఇక నుండి టిజిఎన్పిడిసిఎల్ గాను, టీఎస్ఆర్టీసీ పేరును
టిజిఆర్టీసీగా మార్చాలని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు శనివారం సర్క్యులర్ జారీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. జిల్లాలోని పబ్లిక్ సెక్టార్ యూనిట్లు,ఏజెన్సీలు,స్వయం ప్రతిపత్తి గల సంస్థలు,ప్రభుత్వ సంస్థలన్నీ ఇకపై వాటి పేర్లను టిజితో ప్రారంభమయ్యేలా మార్చుకోవాలని ఆమె సూచించారు.లెటర్ హెడ్లు, రిపోర్టులు,నోటిఫికేషన్లు, అధికారిక వెబ్ సైట్లు, ఆన్లైన్ ఫ్లాట్ ఫార్మ్స్,పాలసీ పేపర్లు, జీవోలు,ఇతర అధికారిక
కమ్యూనికేషన్ల అన్నింటిపై టీఎస్ స్థానంలో టీజీగా మార్చాలని ఆమె పేర్కొన్నారు.శాఖలు ద్వారా భవిష్యత్తులో నిర్వహించే ఉత్తర,ప్రత్యుత్తరాలలో టీఎస్ కు బదులుగా టీజీని ముద్రించాలని సూచించారు.ఈమేరకు తీసుకున్న చర్యలపై ఈనెల 25వ తేదీలోపు అన్ని శాఖల అధికారులు నివేదికలు పంపాలని,అట్టి నివేదికలు క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.