DYFI యువ కిషోరం అమరజీవి కామ్రేడ్ సత్తెనపల్లి.రామకృష్ణ భవన్ ప్రారంభం.
★ DYFI రాష్ట్ర కమిటీ సభ్యులు:చింతల రమేష్ పిలుపు.
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి ఖమ్మం(మే 18):
డి.వై.యఫ్.ఐ ఖమ్మం జిల్లా యువ కిషోరం అమరజీవి కామ్రేడ్ సత్తెనపల్లి.రామకృష్ణ భవన్ ప్రారంభం సందర్బంగా మే 19న జరిగే రెడ్ షార్ట్ ఎర్రసేన కవాతును,ప్రారంభ బహిరంగ సభకు యువత,ప్రజలంతా తరలివచ్చి జయప్రదం చేయలని డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల. రమేష్ పిలుపునిచ్చారు.
స్థానిక ఖానాపురం హవేలీలోనే 11వ డివిజన్ కవిరాజ్ నగర్, వరదయ్య నగర్ ప్రాంతాలలో బహిరంగ సభను, కవాతునీ జయప్రదం చేయాలని విసృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ పోరాట యోధుడు,డి.వై. యఫ్.ఐ జిల్లా యువ కిషోరం అమరజీవి సత్తెనపల్లి రామకృష్ణ పేరుతో స్థానిక ఇందిరానగర్ సెంటర్లో నిర్మించిన సీపీఐ (ఎం) ఖానాపురం హవేలీ కమిటీ నూతన కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ భవనాన్ని కేరళ రాష్ట్ర శాసనసభ్యులు ,ఆ రాష్ట్ర మాజీ ఆరోగ్యశాఖ మంత్రి, సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు కేకే శైలజ టీచర్ ప్రారంభిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు హాజరవుతారని వివరించారు. ఆఫీస్ పక్కనే ఉన్న వినియోగదారుల ఫోరం స్థలంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.భవనానికి డి.వై.యఫ్.ఐ జిల్లా యువకిషోరం అమరజీవి సత్తెనపల్లి రామకృష్ణ భవన్ గా పెరుపెట్టడం చాలా హర్శించాల్సిన విషయం అన్ని అన్నారు. ఖమ్మం జిల్లాలో డి.వై.యఫ్.ఐ ఉద్యమ ప్రస్థానంలో రామకృష్ణ అన్నది చెరగని ముద్ర అన్ని అన్నారు.డి.వై.యఫ్.ఐ ఖమ్మం జిల్లా యువ కిషోరం అమరజీవి కామ్రేడ్ సత్తెనపల్లి.రామకృష్ణ భవన్ ప్రారంభం సందర్బంగా మే 19న జరిగే రెడ్ షార్ట్ ఎర్రసేన కవాతును,ప్రారంభ బహిరంగ సభకు యువత,ప్రజలంతా తరలివచ్చి జయప్రదం చేయలని డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల. రమేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో CPM డివిజన్ కార్యదర్శి మండల నాయకులు తోట.నాగరాజు, నాయకులు కొత్తపల్లి.వెంకటేశ్వర్లు, లక్ష్మణ్,తోట.వెంకన్న,మెట్టేల.శ్రీను, పున్నయ్య, ప్రితం గార్లు తదితరులు పాల్గొన్నారు.