నేటి గద్దర్, ములుగు/ వెంకటాపురం మండలం (మే 18):
జిల్లాలో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులను జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ పరిశీలించారు శనివారం ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాలలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలలో జరుగుతున్న అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజ డిఆర్డిఏ శ్రీనివాస్ కుమార్ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా తాగునీటి సంపులు, మరుగుదొడ్లను పరిశీలించి, పకడ్బందీగా నిర్మించాలని సూచించారు. అలాగే వాష్ ఏరియా బేసిన్ లలో ట్యాప్ లను పటిష్టంగా ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యుత్తు, కాంపౌండ్ వాల్, గేట్, తదితర మౌలిక సదుపాయాలపై ఆరా తీసి, తగిన సూచనలు చేశారు.అనంతరం విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తుల తయారీని పరిశీలించి గడులోపు పూర్తిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డిఆర్డిఏ బాలస్వామి, వాజేడు ,తాడ్వాయి, వెంకటాపురం మండలాల ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు..