★ ఏ అధికారి పట్టించుకోవడం లేదు
★మాకు నీళ్లు అందించండి
★ వేడుకుంటున్న గ్రామస్తులు.
నేటి గద్దర్ న్యూస్,ములకలపల్లి:
ములకలపల్లి మండల పరిధిలోని మోగరాల గుప్ప గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ కాలనీలో గత నెల రోజుల నుండి త్రాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వేసవి కాలం దృష్ట్యా ఏ అధికారికి విన్నవించుకున్న పంటించుకునే నాధుడే లేకపోయే. గ్రామ పంచాయితీల్లో స్పెషల్ ఆఫీసర్ కి ఎన్ని సార్లు చెప్పిన పంటించు కోవడం లేదని,బోర్ నుండి వాటర్ రావట్లేదు. మిషన్ భగీరథ పైప్ లైన్ కలెక్షన్ లేదు. పంచాయతీ ట్యాంకర్ తో ఒకరోజు నీళ్లు పోస్తే మరొక రోజు పోయట్లేదు.నీళ్లు లేక కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.కాలనీలో మొత్తం 26 కుటుంబాలు నివసిస్తున్నాయి. కాలనీ ప్రజలు సొంత డబ్బులు ఖర్చు చేసి బోర్ (కంబార్షన్) పిచికారి చేయించిన బోర్ నుండి నీళ్లు రావట్లేదని గ్రామస్తులు తెలిపారు.
Post Views: 160