– ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్
నేటి గదర్, మే 18, భద్రాచలం / భద్రాద్రి కొత్తగూడెం :
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు 2024 -25 విద్యా సంవత్సరానికి జాతీయ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం (ఎన్ఓఎస్) ద్వారా ఆర్థిక సహాయం పొందేందుకు ఆసక్తి కలిగిన గిరిజన విద్యార్థినీ విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అర్హులైన గిరిజన విద్యార్థినీ విద్యార్థులు ఈనెల 31 వరకు overses.tribal.gov.in అంతర్జాలంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.
Post Views: 49