లైన్స్ క్లబ్
చార్టర్ ప్రెసిడెంట్ పిల్లారి శెట్టి హరిబాబు 45వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా
సామాజిక సేవా కార్యక్రమాలు…
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి , మణుగూరు (మే 19):
లయన్స్ క్లబ్ మణుగూరు వారి ఆధ్వర్యంలో చార్టర్ ప్రెసిడెంట్ పిల్లారి శెట్టి హరిబాబు 45వ వివాహ వార్షికోత్సవాన్ని సుందరయ్య నగర్ లో సామాజిక సేవా కార్యక్రమాల తో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మణుగూరు సభ్యులు మరియు వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్ సభ్యులు పుర ప్రముఖులు,డాక్టర్లు హరిబాబు భానుమతి దంపతులను పూలమాలలతో శాలువాలతో ఘనంగా సత్కరించి,45వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా బాల వెలుగు పాఠశాలకు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని, అశ్వాపురంలోని ఆరిఫా రోషిని వృద్ధాశ్రమానికి అరకింట బియ్యం మరియు 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మణుగూరు ప్రెసిడెంట్ గాజుల పూర్ణచంద్రరావు సెక్రటరీ డాక్టర్ షేక్ మీరా హుస్సేన్ లు మాట్లాడుతూ,సేవా గురువు, మానవతావాది పిల్లారి శెట్టి హరిబాబు వివాహ వార్షికోత్సవంలో కేవలం సెలబ్రేషన్స్ లే కాకుండా సామాజిక బాధ్యత,సేవా దృక్పథంతో వీధి బాలల పాఠశాల బాల వెలుగుకు, అశ్వాపురంలోని ఆరిఫా రోషిని వృద్ధాశ్రమానికి వితరణలు అందించి పలువురికి సేవ స్ఫూర్తినిచ్చి,ఆదర్శం అయ్యారని అన్నారు.మనం సంతోషంగా జరుపుకునే వేడుకలలో ఆ పన్నులకు సహాయం అందించడం సరికొత్త మానవీయ సంస్కృతి అన్నారు.లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పుర ప్రముఖులకు లయన్స్ క్లబ్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.పిల్లారి శెట్టి హరిబాబు- భానుమతి దంపతులు 45 ఏళ్ల క్రితం నాటి తమ వివాహ తీపి గుర్తులను నెమరు వేసుకుని ఎంతో ఆనందపడ్డారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గాజుల పూర్ణచంద్రరావు,సెక్రటరీ డాక్టర్ షేక్ మీరా హుస్సేన్,జోన్ చైర్పర్సన్ డెసిగ్నేట్,భూక్య ప్రసాద్,కముజు చంద్రమోహన్, డాక్టర్ దుస్సా సమ్మయ్య,ఎం నాగేశ్వరరావు,దోసపాటి వెంకటేశ్వరరావు,దుగ్గి సతీష్ కుమార్,డాక్టర్ శశిధర్ బాలకృష్ణ, శ్రీను,వాసవి క్లబ్ నుండి కడవెండి విశ్వనాథ గుప్తా,బండారు నరసింహారావు,చిత్తలూరి రమేష్ బొగ్గవరపు అంజలి,మురారి,పుర ప్రముఖులు దొబ్బల వెంకటప్పయ్య,వెంకట్,రవి మరియు కుటుంబ సభ్యులు ప్రదీప్,డాక్టర్ కోలా కృష్ణమోహన్ -ప్రణతి,తదితరులు పాల్గొన్నారు.