నేటి గద్ధర్ న్యూస్, అల్లూరి సీతారామరాజు జిల్లా:
హుకుంపేట మండలం దాలిగుమ్మాడి గ్రామం కొమ్మా సింహాచలం రామ దంపతుల యొక్క రజస్వల ఆహ్వాన కార్యక్రమంలో, ప్రదర్శించిన స్వరాజ నటరంజని మ్యూజికల్ ఆర్కెస్ట్రా కళా బృందానికి ఆదివాసీ కళాకారులను,అల్లూరి జిల్లా కళాకారుల సంక్షేమ సేవా సంఘం మరియు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తాపుల.క్రిష్ణారావు,లింగమూర్తి ఆధ్వర్యంలో కళాకారులకు దుశ్శాలువతో సన్మాణించడమైనది.
పెదబయలు బాలుర ఆశ్రమ పాఠశాల మరియు లక్ష్మీపురం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, టి.నాగేశ్వరరావు,ఎల్.నిలంకంటేశ్వరరావులు కళాకారులకు సాలువ కప్పి ఘనంగా సన్మానించారు.
ఈసందర్భంగా కళా బృందం నాయకులు,బృంద సభ్యులు అభినందనలు తెలియజేసారు.
ఈకార్యక్రమానికి గిరిజన కళాకారుల సంక్షేమ సేవా సంఘం నాయకులు, డూరు కృష్ణమూర్తి, పాంగి.లింగమూర్తి మరియు ఉపాద్యాయులు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.