-ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు.. సాంకేతిక రంగాన్ని రాజీవ్ పరుగులు పెట్టించారు
– గ్రామ స్వరాజ్యానికి పునాదులు వేసింది రాజీవ్ గాంధీ
– కంప్యూటర్ విద్యను అమలు చేసి, దేశంలోని యువతకు ఉపాధి ఆవ కాశాలు కల్పించిన ఘనత మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీగారికే దక్కుతుంది
– రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క
నేటి గద్ధర్ న్యూస్ ,హైదారాబాద్:
స్వర్గీయ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగామంత్రి వర్యులు సీతక్క క్యాంప్ కార్యాలయంలో మంగళవారం రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఘన నివాళి అర్పించారు.
అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ
కంప్యూటర్ విద్యను అమలు చేసి, దేశంలోని యువతకు ఉపాధి ఆవ కాశాలు కల్పించిన ఘనత మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ అని గాంధీ కుటుంబం మొత్తం దేశానికి, దేశ ప్రజల సేవకే అంకితమైం దన్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు అనేక సంస్కరణలు తెచ్చి దే శాన్ని అభివృద్ధి పథంలో నడిపించాడని కొనియాడారు
గ్రామ స్వరాజ్యం తీసుకురావాలని 73, 74 అమెండ్మెంట్ ద్వారా పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయడానికి కేంద్రం నుంచి గ్రామపంచాయతీలకు నేరుగా నిధులను పంపించే వ్యవస్థను ఆనాటి ప్రధానిగా రాజీవ్ గాంధీ చేసిన విషయాన్ని దేశంలో ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గుర్తు చేసుకోవాలన్నారు. స్థానిక సంస్థలు గ్రామ స్వరాజ్యానికి పునాదులు వేసిన గొప్ప మహనీయుడు రాజీవ్ గాంధీ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలని మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క అన్నారు .
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.