ఘనంగా రాజీవ్ గాంధీ 33 వ వర్ధంతి.
నేటి గద్ధర్ న్యూస్,కరకగూడెం:
మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీవర్ధంతి సందర్భంగా కరకగూడెం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్ర పటానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్. పూల మాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,భారతదేశాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసిన ధృవతార ఐటి రంగానికి పునాదులు వేసిన మార్గదర్శి, నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్భాందవుడు యువతకు 18 ఏళ్ళకే ఓటు హక్కును కల్పిస్తూ యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేలా చేసిన సంస్కరణ కర్త రాజీవ్ గాంధీ గారు అని అన్నారు.భారతదేశ సాంకేతిక అభివృద్ధి ఆద్యుడు, పరిపాలనలో సంస్కరణలు తెచ్చిన నాయకులు, దేశ సౌభ్రాతృత్వం కాపాడటం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయులు, నవ భారత నిర్మాత, భారతరత్న దివంగత ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ.ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన పాలనాధ్యక్షులు, భారత రత్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి వర్థంతి సందర్భంగా ఆ మహానీయుడికి ఘనంగా నివాళులు ఆర్పిస్తూ రాజీవ్ గాంధీ ప్రతి పేద వాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అని తెలిపారు..
ఈ కార్యక్రమంలో మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మండల మహిళా అధ్యక్షురాలు చందా వెంకట రత్నమ్మ మండల నాయకులు ఎర్ర సురేష్, మనుగూరు మండల మహిళా నాయకురాలు సౌజన్య, మండల నాయకులు గొగ్గలి రవి,పూజారి వెంకన్న ఏట్టి బిక్షపతి గాంధర్ల రామనాథం, ఉకే కేశవరావు సోలం రామకృష్ణ, ధనుంజయ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.