◆రోడ్డు ప్రమాదంలో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహయం అందించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా 1995 బ్యాచ్ ఏ.ఆర్ సిబ్బంది
◆ఆర్థిక సహాయం అందించి బాసటగా నిలిచిన బ్యాచ్ సిబ్బందిని అభినందించిన : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏ. ఆర్ హెడ్ క్వార్టర్స్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తు ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన హెడ్ కానిస్టేబుల్ గంగాధర అంజయ్య కుటుంబానికి 1995 బ్యాచ్ ఉమ్మడి కరీంనగర్ కి చెందిన ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బంది బాసటగా నిలిచి స్వచ్ఛందంగా (1,80,000/- రూపాయలు) వారి కుటుంబా సభ్యులకు మంగళవారం రోజున జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారి చేతుల మీదుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇవ్వడం జరిగింది.పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని, ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన అన్ని రకాల లబ్ది సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామని ఎస్పీ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఐ యాదగిరి, హెడ్ కానిస్టేబుల్ రవీందర్, మల్లేశం,ప్రభాకర్,బాలు, మనోజ్ కుమార్,అంజయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.