నేటి గద్ధర్ న్యూస్,మణుగూరు:
మణుగూరు ప్రభుత్వ 100 పడకల హాస్పిటల్ లో చోరీకి గురైన సామాగ్రి రికవరీ చేయాలి కాంటాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్యాధి కారిణి జే వి ఎల్ శిరీష గారికి వినతి పత్రం అందజేశారు.
మణుగూరు ప్రభుత్వ 100 పడకల హాస్పిటల్ లో చోరీకి గురైన సామాగ్రి రికవరీ చేయాలనీ కాంటాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలనీ కోరుతూ
ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో ఆసుపత్రి సందర్శనకు వచ్చిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్యాధి కారిణి జే వి ఎల్ శిరీష కి బుధవారం నాడు ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు మిడిదొడ్ల నాగేశ్వరరావు నాయకత్వంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో దాతలు ఇచ్చిన సామాగ్రితో పాటు కొంత హాస్పిటల్ సామాగ్రి కూడా చోరీకి గురైనట్లుగా వార్తలు వస్తున్నాయనీ దీనిపై సమగ్ర విచారణ జరిపించి సామాగ్రిని రికవరీ చేయాలనీ దాతలకు నమ్మకం కలిగించాలనీ దోషులు ఎంతటి వారైనా ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు అదేవిధంగా పెండింగ్ లో ఉన్న కాంటాక్ట్ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించే విధంగా మరియు ప్రస్తుతం హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్ జమ వివరాలతో కూడిన పాస్ బుక్ లు అందజేయాలి భీమ పథకాలు వర్తింపచేయాలి ఈ కార్యక్రమంలో ఐఎఫ్ టీ యు జిల్లా నాయకులు మిడిదొడ్ల నాగేశ్వరరావు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రగతిశీల మహిళా సంఘం మణుగూరు డివిజన్ కార్యదర్శి రాపర్తి లక్ష్మి , ఉప్పల శివరామకృష్ణ, పెనుగొండ నాగార్జున పి వై ఎల్ నాయకులు సాధన పల్లి రవి తదితరులు పాల్గొన్నారు.
