పాలేరు నియోజకవర్గంలో పలకరింపులు ,ఆశీర్వాదాలు..
నేటి గదర్, మే 22 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగేందర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ..తమను అంటిపెట్టుకుని నమ్ముకున్న వాళ్ళకి అండదండలు అందిస్తూ ప్రేమను చూరగొంటున్నారు.. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే… గతంలో పాలేరు నుండి ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలిచి పాలేరు ప్రజలకు దగ్గయ్యారు తుమ్మల నాగేశ్వరరావు. అప్పటి నుంచి పాలేరు ప్రజలతో మమేకమై ఉన్నారు… 2018 ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయిన తరువాత కూడా పాలేరు ప్రజలకు దూరం కాలేదు ఎప్పుడు పాలేరును అంటిపెట్టుకుని అందుబాటులో ఉన్నారు.. అలాగే తుమ్మల తనయుడు తుమ్మల యుగంధర్ కూడా తమను నమ్ముకున్న నాయకులు , కార్యకర్తల కోసం ఎప్పుడు పాలేరులో పర్యటిస్తూ వారికి అండదండలుగా ఉన్నారు.. కొన్ని సమీకరణాల వల్ల పాలేరు నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి వచ్చి ఖమ్మం శాసనసభ నుంచి పోటీ చేసి విజయం సాధించడమే కాకుండా మంత్రి పదవిని కూడా చేపట్టాడు.. ఐతేనేమి పాలేరు నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు. బుదవారం తిరుమలాయపాలెం మండలం తుమ్మల తనయుడు తుమ్మల యుగంధర్ పర్యటించారు..పర్యటనలో భాగంగా మాజీ ఎంపీపీ కాంగ్రెస్ నాయకుడు కొప్పుల అశోక్ తల్లి ఇటీవల కన్నుమూసిన విషయం తెలుసుకున్న యుగంధర్ ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి ఇవాళ అర్పించారు. అనంతరం హైదర్సాయిపేట గ్రామంలో సింగర్ రమేష్ కుమారుల పుట్టు వెంట్రుకల కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. పాతర్లపాడు గ్రామంలోని తుమ్మల అభిమానులను ఆప్యాయంగా పలకరించి ఖమ్మం ప్రయాణమై వెళ్ళారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు..