+91 95819 05907

చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది : జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.

రైతులు ఆందోళన చెంది ధాన్యం అమ్మకం చేయవద్దు చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.

నేటి గదర్ న్యూస్, మే 22, ములుగు ప్రతినిధి:

జిల్లాలో వరి ధాన్యం పండించిన రైతులు ఆందోళన చెంది తక్కువ ధరకు ధాన్యం అమ్మకం చేసుకోవద్దని, చివరి గింజ వరకు ప్రభుత్వం గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ ) సి.హెచ్. మహేందర్ జి, ఆర్డిఓ సత్యపాల్ రెడ్డి లతో కలిసి కలెక్టరు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 50వేల 175 ఎకరాలలో ఒక లక్ష 4,775 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండిస్తున్నారని, రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ఇప్పటికే జిల్లాలో ఎఫ్ సి ఐ ద్వారా కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అకాల వర్షాల కారణంగా కొన్ని చోట్ల వరి ధాన్యం తడవగా ఆ ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకురావాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారని అన్నారు. కొందరు రైతులు కంగారుపడి రైస్ మిల్లర్లకు తక్కువ ధరకే అమ్మకం చేసుకుంటున్నారని విషయం గ్రహించామని, రైతులు ఎవరు వరి ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్మకం చేసుకోవద్దని సూచించారు. ఇతర రాష్ట్రాల నుండి జిల్లాలోకి వరి ధాన్యం రాకుండా ఇప్పటికే వాజేడు మండలం వద్ద ప్రత్యేక చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని, రెండు ఫ్లయింగ్ స్కాడ్స్ నిత్యం పర్యటిస్తున్నారని మండల స్థాయిలో ఎమ్మార్వో ఆధ్వర్యంలో నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఈ నెల 19న కురిసిన అకాల వర్షం కారణంగా 7000 మెట్రి క్ టన్నుల వరి ధాన్యం తడిసిందని, తడిసిన 7 వేల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. కొందరు వ్యక్తులు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వాటిని నమ్మవద్దని రైతులను కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు గురైన 9347416178 అనే హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి వివరించవచ్చని, హెల్ప్ లైన్ వారం రోజులలో 24 గంటల పాటు పనిచేస్తుందని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు చేయడానికి సంబంధిత అధికారులతో కృషి చేస్తున్నామని, మొలకెత్తిన వరి ధాన్యంపై ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. విలేకరుల సమావేశంలో జిల్లా సివిల్ సప్లై మేనేజర్ బి. రాంపతి, డి సి ఓ సర్దార్ సింగ్, డి పి ఆర్ ఓ ఎండీ రఫిక్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

అశ్వారావుపేట అభివృద్ధికి రూ.15 కోట్లు: మౌలిక వసతులే లక్ష్యంగా మంత్రి పొంగులేటి భూమిపూజ

​పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రకటన నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, జనవరి, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మున్సిపాలిటీని సర్వాంగ

Read More »

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

 Don't Miss this News !