పర్సా సత్యనారాయణ ఆశయాలతో ముందుకు సాగాలి
– సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు
నేటి గదర్, మే 22, మణుగూరు / భద్రాద్రి కొత్తగూడెం :
బుధవారం మణుగూరు పట్టణంలోని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) సిపిఎం ఆధ్వర్యంలో శ్రామిక భవన్ లో కొడిశాల రాములు అధ్యక్షతన పర్సా సత్యనారాయణ 9వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పర్సా సత్యనారాయణ చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కార్మికు ఉద్యమ నిర్మాత పరిషత్ సత్యనారాయణ ఆశయాలతో ప్రతి కార్యకర్త ముందుకు సాగాలని అన్నారు. దేశంలో కార్మికుల, కార్మిక సమస్యలపై సమరశీల పోరాటాల సూత్రధారని అటువంటి వారి ఆశయాల కోసం వారు చేసిన పోరాటాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. చిన్నతనం నుండే స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించి కమ్యూనిస్టు పార్టీకి ఎన్నోదన్నగా ఉండి మహా నాయకుడు పరస సత్యనారాయణ అని ఆయన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు నెల్లూరు నాగేశ్వరరావు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గద్దల శ్రీనివాస్, సిపిఎం మణుగూరు మండల కార్యదర్శి కొడిశాల రాములు, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు సత్ర పల్లి సాంబశివరావు, సిపిఎం మండల కమిటీ సభ్యులు ఈశ్వరరావు, పిట్టల నాగమణి, పి.నాగేశ్వరరావు సింగరేణి బ్రాంచ్ కార్యదర్శి వెంకటరత్నం, సుధాకర్ భీమయ్య, బొల్లం రాజు తదితరులు పాల్గొన్నారు.