నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు మే 22:
మణుగూరు సింగరేణి ఏరియాలో ఎస్టేట్స్ జిఎం బృందం ఓసి విస్తరణలో భాగంగా అవసరమైనా 58.51 హెక్టార్ల ఫారెస్ట్ భూములు,329 హెక్టార్ల రెవెన్యూ భూముల పర్మిషన్ గురించి ఎంఎన్‌జిఓసి ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాస చారితో చర్చించడం జరిగింది.అలాగే ఎంఎన్‌జిఓసి వ్యూ పాయింట్ నుండి మణుగూరు ఓసి నందు జరుగుతున్న ఉత్పత్తి చేసే విధానాన్ని మరియు పని స్థలాలను పరిశీలించారు. అనంతరం ఎంఎన్‌జిఓసి పునరావాస ప్రాంతమైన కొత్త కొండాపురం ఆర్&ఆర్ కాలనీ నందు సింగరేణి యాజమాన్యం ఏర్పాట్లు చేసిన రోడ్లు,డ్రైనేజ్లు, ఇతర సౌకార్యాలను పరిశీలించారు.అనంతరం ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ తో సమీక్షా సమావేశం నిర్వహించి డైరెక్టర్ ఆఫ్ మైన్స్ & జియాలజీ నుండి మణుగూరు ఏరియాలో అన్ని ఓసి లకు ఒకటే లీజు తీసుకోవడానికి అవకాశాల గురించి జిఎం(ఎస్టేట్స్) బి వెంకటయ్య చర్చించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్‌ఓ టు జిఎం శ్యామ్ సుందర్, ప్రాజెక్ట్ అధికారి ఎంఎన్‌జిఓసి శ్రీనివాస చారి,కార్పొరేట్ ఎస్టేట్స్ అధికారి సురేశ్,శ్రీనివాస్, సీనియర్ ఎస్టేట్స్ అధికారి బాబుల్ రాజ్,ఏరియా సర్వే అధికారి శైలెండర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.