+91 95819 05907

తీన్మార్ మల్లన్న ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

★కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో రఘురాం రెడ్డి పిలుపు

★మార్పు ఆవశ్యకతను వివరిద్దాం: ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ చార్జ్ రఘునాథ్ యాదవ్

నేటి గదర్,మే 23 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):

ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు భారీ విజయాన్ని అందిద్దామని, ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు విశేషంగా కృషి చేయాలని కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఖమ్మoలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో పాలేరు నియోజకవర్గస్థాయి కాంగ్రెస్ నాయకుల ఆత్మీయ సమావేశంలో ప్రసంగించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పట్టభద్రులకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ప్రజా గొంతుకను చట్టసభలో వినిపించేందుకు తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ చేద్దామని అన్నారు. ప్రతి గ్రామంలో కమిటీగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పట్టభద్రుల ఓట్లు అభ్యర్థించాలని కోరారు.

*పట్టభద్రుల వద్దకే మనం: రఘునాథ్ యాదవ్*

గ్రామ గ్రామాన పట్టభద్రుల వద్దకు వెళ్లి.. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాల్సిన ఆవశ్యకత వివరిద్దామని ఎమ్మెల్సీ ఎన్నికల పాలేరు నియోజకవర్గ ఇన్ చార్జ్ రఘునాథ్ యాదవ్ తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం, పట్టభద్రుల వాణి వినిపించేందుకు తీన్మార్ మల్లన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో.. రాష్ట్ర విద్యా, మౌలిక వసతుల కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, సీనియర్ నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి, జెడ్పిటిసి బెల్లం శ్రీను, ఎంపీపీ మంగీలాల్, కాంగ్రెస్ రూరల్ మండలాధ్యక్షులు కళ్లెం వెంకటరెడ్డి, నాయకులు నెల్లూరి భద్రయ్య, చావా శివరామకృష్ణ, కొప్పుల అశోక్, మద్ది మల్లారెడ్డి, రైట్ చాయిస్ అధినేత మెండెం కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

ఝాన్సీలింగాపూర్ లో కుటుంబ కలహాలతో చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా ఝాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన కాల్వల రాజు (36) సంవత్సరాల వయస్సు గల వ్యక్తి వృత్తిరీత్యా మిషన్ భగీరథ వాటర్ సప్లయ్ పనిచేస్తుంటాడు.తను శుక్రవారం

Read More »

 Don't Miss this News !