★ ఏసీబీ అదుపులో డిప్యూటీ తహసిల్దార్
★ భూమిని పట్టా చేయడానికి రూ.50 వేలు డిమాండ్?
★ ఏసీబీ ని ఆశ్రయించిన బాధిత రైతు
నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి: చర్ల మండల డిప్యూటీ తాసిల్దార్ ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించారు . చర్ల మండలానికి చెందిన ఓ రైతు భూమిని పట్టాగా మార్చే క్రమంలో డబ్బులు డిమాండ్ చెయ్యడం తో బాధిత రైతు ACB ని ఆశ్రయించినట్లు విశ్వసనీయ సమాచారం. దీనితో ఏసీబీ అధికారులు గురువారం వల పన్ని రైతు నుండి డబ్బులు లంచం తీసుకుండగా డిప్యూటీ తహసిల్దారుని అదుపులోకి తీసుకున్నారు. పట్టాదార్ పాస్ పుస్తకం ఇవ్వడానికి డిప్యూటీ తాసిల్దార్ భరణి బాబు బాధిత రైతు నుండి రూ.20,000 తీసుకుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టు కున్నట్లు కొత్తగూడెం ఏసీబీ సీఐ రమేష్ బాబు తెలిపారు.
Post Views: 539