లైసెన్స్ ,ధరల పట్టిలను, స్టాక్ బోర్డును తప్పక ప్రదర్శించాలి..
ఏడిఏ విజయచంద్ర
నేటి గదర్, మే 23 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
కూసుమంచి గ్రామ పరిధిలోని రైతు వేదిక నందు పురుగుమందుల ,ఎరువుల విత్తన వ్యాపారులతో ఏడిఏ విజయచంద్ర మండల వ్యవసాయ అధికారి వాణి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏ డి ఏ విజయచంద్ర మాట్లాడుతూ… డీలర్లు అందరూ విత్తన చట్టం పురుగు మందుల చట్టం, ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ చట్టాలకు లోబడి వ్యాపారం చేయాలని సూచించారు. ప్రతి ఒక్క షాపులో తప్పనిసరిగా లైసెన్సులను కనపడేలా పెట్టాలని, స్టాప్ బోర్డు, ధరల పట్టికను ప్రదర్శించాలని, స్టాక్ బుక్ లను విధిగా రోజువారీగా అప్డేట్ చేయాలని, లైసెన్స్ నందు పిసిలు ఓ ఫామ్ లు జతపరచుకోవాలని సూచించారు. పివోఎస్ మెషిన్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ గ్రౌండ్ బ్యాలెన్స్ సరితూగాలని సూచించారు. ఎవరైనా ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మినట్లు సమాచారం వస్తే వారిపై సంబంధిత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విత్తనాలకు సంబంధించి జిఓటి రిపోర్ట్స్ విత్తన తయారీదారు యొక్క లైసెన్స్, సోర్స్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉంచుకోవాలని సూచించారు. విత్తనాలకు సంబంధించి కృత్రిమ కొరత సృష్టించరాదని ఎక్కడైనా అటువంటి ఫిర్యాదు వస్తే వారిపై చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. గ్రామాలలో ఎక్కడైనా అనుమతి లేకుండా విత్తనాలు అమ్ముతున్నట్లు సమాచారం తెలిస్తే వ్యవసాయ శాఖ వారికి తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పురుగుమందుల, ఎరువుల విత్తన డీలర్లు, ఏఈవోలు పాల్గొన్నారు.