– బెల్లం పానకం ధ్వంసం చేసిన అధికారులు
నేటి గదర్, మే 23, బూర్గంపాడు / భద్రాద్రి కొత్తగూడెం :
బూర్గంపాడు మండల పరిధిలోని గోదావరి పరిసర ప్రాంతాల్లో నిషేధిత గుడుంబా తయారు చేసేందుకు ఏర్పాటు చేసిన గుడుంబా స్థావరాలపై భద్రాచలం ఎక్సైజ్ సీఐ రెహమాన్షా ఆదేశాల మేరకు ఎక్సైజ్, డిటిఎఫ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. భద్రాచలం ఎక్సైజ్ ఎస్సై అల్లూరి సీతారామరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడులలో సుమారు 400 లీటర్ల బెల్లం పానకం లభ్యం కాగా, గుడుంబా తయారీకి ఉపయోగించే డ్రమ్ములు దొరికినట్లు అధికారులు వెల్లడించారు. గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లం పానకాన్ని, డ్రమ్ములను ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఎవరైనా నిషేధిత గుడుంబా తయారు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడులలో భద్రాచలం ఎక్సైజ్ కానిస్టేబుల్ లు వీరబాబు, బాబు, కొత్తగూడెం డిటిఎఫ్ సిబ్బంది గౌతమ్, పాల్వంచ ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.