నిరుపయోగంగా అంగన్వాడి కేంద్రం
నేటి గదర్, మే 23, బూర్గంపాడు / భద్రాద్రి కొత్తగూడెం :
బూర్గంపాడు మండల పరిధిలోని నాగినేని ప్రోలు రెడ్డిపాలెం పంచాయితీ గొమ్మురూ మినీ అంగన్వాడీ కేంద్రం నిరుపయోగంగా మారింది. ఇక్కడ కేటాయించిన గొమ్మురూ మినీ అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్న పిల్లలు పక్కనే పల్లె దవాఖాన ఉండడం, సరైన సెక్యూరిటీ వసతుల లేకపోవడంతో గత పాలకవర్గం, అధికారుల అనుమతితో గొమ్మురూ కాలనీలోని ఐటిడిఏ స్కూల్ నందు ఖాళీగా ఉన్న భవనంలోకి మార్చారు. అప్పటి నుండి ఈ మినీ అంగన్వాడి కేంద్రం నిరుపయోగంగా మారింది. ఈ అంగన్వాడీ కేంద్ర భవనం, పల్లె దవాఖాన వేరువేరుగా ప్రహరీ నిర్మాణం చేపట్టి ఉపయోగంలోకి తేవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ అంగన్వాడీ కేంద్రాన్ని ఉపయోగంలోకి తేవాలని పలువురు కోరుతున్నారు.
ఐటిసి ద్వారా రిపేర్ చేయిస్తాం : సిడిపిఓ ప్రమీలా
మినీ అంగన్వాడి కేంద్రాన్ని మరమ్మత్తులు చేయడం కోసం ఐటిసికి ప్రతిపాదన పంపించడం జరిగిందని సిడిపిఓ ప్రమీల తెలిపారు. త్వరలో మినీ అంగన్వాడీ కేంద్రం మరమత్తులు నిర్వహించిన అనంతరం అంగన్వాడీని తెరవడం జరుగుతుందన్నారు. ప్రస్తుతానికి స్కూల్లోనే అంగన్వాడి కేంద్రం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.