నేటి గద్ధర్ న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి (దుమ్ముగూడెం):
నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండియా కూటమిలో బాగంగా కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇవ్వడం జరిగిందని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండ చరణ్ తెలిపారు. దుమ్ముగూడెం మండలం లో ఆ పార్టీ ఆధ్వర్యంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం కాంక్షిస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మతోన్మాద బిజెపి, దాని మిత్రపక్షాలను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని పిలుపునిచ్చారు.
విద్యావంతులైన ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు తమ అమూల్యమైన ఓట్లు వేసి అత్యాధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా)
Post Views: 35