ఆ విద్యార్థిని కి ఎందుకా ధీన స్థితి?కారకులు ఎవ్వరు?
★తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న మారుతి నర్సింగ్ కళాశాల విద్యార్థిని
నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్డులో ఉన్న మారుతి నర్సింగ్ కళాశాల విద్యార్థిని పగిడిపల్లి కారుణ్య తీవ్రమైన గాయాలతో అపస్మార్క స్థితిలో చికిత్స పొందుతుంది.కారుణ్య మొదటి సంవత్సరం బిఎస్సి నర్సింగ్ విద్యను ఈ కళాశాలలో అభ్యసిస్తుంది.గురువారం తెల్లవారుజామున తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్ళింది.కళాశాల వసతి గృహంలో ఈ సంఘటన జరగటం వలన అనుమానాలు కలుగుతున్నాయి.కళాశాలకు కళాశాల వసతి గృహానికి సరైన రక్షణ చర్యలు లేవు.
★★★★★★★★★★★★
మొదటి సంవత్సరం చదువుతున్న కారుణ్య పై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారా?
లేకపోతే బయట వ్యక్తులు హత్య ప్రయత్నం చేశారా?
ర్యాగింగ్ విషయంలో సీనియర్ విద్యార్థులు హత్యా ప్రయత్నం చేశారా?
కారుణ్య 1 నుండి ఇంటర్ వరకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, గురుకుల కళాశాలలో చదువుకున్నది.
పదవ తరగతిలో 10/10 మార్కులతో ఉత్తీర్ణత.
ఇంటర్లో 901 మార్కులతో ఉత్తీర్ణత.
బాగా చదివే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటుందా?
ఈ మిస్టరీని పోలీసులే చేదించాలి.