కారుణ్య మృతికి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలి…
కారుణ్య కుటుంబాన్ని ఆదుకోవాలి…
సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కార్యదర్శి :గడ్డం స్వామి డిమాండ్.
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి భద్రాచలం మే 24:
నైనారపు నాగేశ్వరరావు ✍️
7893538668
భద్రాచలం మారుతి పారా మెడికల్ నర్సింగ్ కళాశాలలో బిఎస్సి నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కారుణ్య మృతి సంఘటన పట్ల సమగ్ర విచారణ జరిపించి కారుణ్య కుటుంబాన్ని ఆదుకోవాలి సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి డిమాండ్ చేశారు. చదువుల సరస్వతి కారుణ్య మృతి దురదృష్టకరమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అర్ధరాత్రులు కళాశాలకు ఆఘాతాయిలు వస్తుంటే కళాశాల యాజమాన్యం కండ్లు మూసుకొని చూస్తున్నారా అని మండి పడ్డారు.నర్సింగ్ కళాశాలలో విద్యార్థినిలకు రక్షణ లేకుండా ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.