నేటి గద్ధర్ న్యూస్,కారేపల్లి:
ఉపాధి హమీ పథకం పనులు కారేపల్లి మండల వ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. మండలాల్లోని దాదాపుగా అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. కూలీల వేతనం కూడా పెంచి చెల్లిస్తున్నారు. కూలీల ఎకౌంట్లో కూడా సకాలంలోనే డబ్బులు జమ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధి కూలీలు పనులు చేయడానికి ముందుకువస్తున్నారు. చెరువులు తవ్వకం, కాలువల, పంట బోదెలల్లో పూడిక తీత పనులు ముమ్మరంగా చేస్తున్నారు. వేసవిలో ఎలాంటి ఉపాధి లభించని క్రమంలో ఎన్ఆర్ఈజీఎస్ 100రోజుల పథకం తమకు చాలా ఉపయోగపడుతుందని ఎన్ ఆర్ ఈజీఎస్ కూలీలు నేటి గద్దర్ న్యూస్ కి తెలిపారు. పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని వారి కోరారు.
Post Views: 39