బూటు కాలితో తన్ని.. ఎస్ఐ నా పై దాష్టీకం:బాధిత వ్యక్తిబోడ రామకృష్ణ
నేటి గద్ధర్ న్యూస్ వెబ్ డెస్క్(ములుగు):
ములుగు జిల్లా ఏటూరు నాగారంకి చెందిన ఓ దళిత వ్యక్తిపై ఎస్సై దాస్టికానికి పాల్పడ్డారు. బాధ్యత వ్యక్తి బోడ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి .ఏటూరు నాగారంకు చెందిన బోడ రామకృష్ణ అనే వ్యక్తి 1 లక్ష రూపాయల డబ్బుల విషయంలో మధ్యవర్తిగా ఉన్నాడు.. ఈ విషయంపై ఎస్ఐ తనను పోలీస్ స్టేషన్‌కు పిలిచి కులం పేరు అగడగా మాల అని అనడంతో.. కులం పేరుతో దూషించి గొంతు పట్టుకొని రూమ్ మొత్తం తిప్పుతూ బూటుకాలుతో కడుపు, వీపులో తన్నాడ ని తెలిపారు.
తనతో తెల్ల కాగితంపై సంతకం చేయించుకున్నాడని.. అకారణంగా తనను కొట్టిన ఎస్ ఐ చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరాడు.
Post Views: 116