నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి
నారాయణపూర్-బీజాపూర్ సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. పలువురు గాయపడ్డారు.
◆ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
మావోయిస్టుల కదలికలపై విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక పోలీసులతో కలిసి స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది నారాయణపూర్ అడవుల్లో గురువారం కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు ఏడుగురు మావోయిస్టులు మరణించారు. నారాయణపూర్ అడవుల్లో ఇంకా ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.
Post Views: 32