★ లేని పక్షంలో రైతులందరితో కలిసి ఉద్యమించడం జరుగుతుంది
నేటి గద్ధర్ న్యూస్,ములుగు ప్రతినిధి:
ములుగు మండలం బరిగానోల పల్లి గ్రామంలో శుక్రవారం MLC ఉప ఎన్నికల ప్రచారం ముగించుకొని తిరుగుప్రయణంలో ములుగు వస్తున్న పోరిక గోవింద్ నాయక్ మార్గమధ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆగి ధాన్యం కొనుగోళ్లపై ఆరా తీశారు . అతని దగ్గరికి వచ్చిన రైతులు తమగోడు వెల్లబోసుకున్నారు.
అధికారులు తమ పంటని కొనుగోలు చేయడం లేదని,అదేంటి అని ప్రశ్నిస్తే తేమ శాతం ఉందని సాకుగా చూపుతున్నారని కొనుగోలు చేస్తున్న వడ్లలో కూడా తరుగు తీస్తున్నారని తెలిపారు.
అసలే యాసంగి పంట ఎన్నో వ్యయ ప్రయసలు పడి పండిచి ఇక్కడికి తీసుకొస్తే ఎప్పుడు కొనుగోలు చేస్తారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గోవింద్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు రైతుల జీవనానికి గొడ్డలి పెట్టు అని ఈపద్దతి అవలంబిస్తే మున్ముందు రైతులనుండి తీవ్ర ఆగ్రహం ఎదుర్కోవలసి వస్తుంది అని హెచ్చరించారు.ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో దారుణమైన విషయం అని అన్నారు. సకాలంలో రైతు బంధు వేయకుండా ప్రజలను ఇబ్బందుల పాలు చేసిందే కాకుండా ఈ రోజు ధాన్యం కొనుగోలు చేయడంలో అలసత్వం వహించడం సరైన పద్ధతి కాదు అని అన్నారు.
ఎప్పుడు వర్షం వస్తుందో వర్షం వస్తే తమ పంట నాశనం ఐపోద్ది అనే ఆవేదనతో రైతులందరు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు అని ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రతి గింజను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే రైతుల ఉసురు ప్రభుత్వానికి తకుద్ధి అని ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు పలికారు.
వెంటనే తరుగు లేకుండా తడిసిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని లేని పక్షంలో రైతులందరితో కలిసి ఉద్యమించడం జరుగుతుందని ప్రభుత్వానికి తన హెచ్చరికను తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పాలెపు శ్రీను,గ్రామ అధ్యక్షుడు లత నర్శింగా రావు నాయకులు వీరాబోయిన రాజేందర్ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.