◆ కామ్రేడ్ నల్లమల్ల ఆశయ సాధన కోసం ముందుకు సాగాలి.
నేటి గదర్, మే 24, ములుగు ప్రతినిధి:
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సిపిఐ డిప్యూటీ ప్రధానకార్యదర్శి రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ నల్లమల్ల గిరిప్రసాద్ 27వ వర్ధంతిని మణుగూరు సిపిఐ పట్టణ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా నల్లమల గిరి ప్రసాద్ ఫోటోకు సిపిఐ సీనియర్ నాయకులు కామ్రేడ్ ఎస్కే సర్వర్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ లక్ష్మీనారాయణ, సిపిఐమండల కార్యదర్శి జంగం మోహన్ రావు, పట్టణ కార్యదర్శి దుర్ఘ్యాల సుధాకర్ లు నివాళులు అర్పించి.మాట్లాడు తూ ఆనాడు పేద ప్రజల కోసం నమ్ముకున్న సిద్ధాంతం కోసం అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించి, గిరిజన దళిత, బడుగు ,బలహీన వర్గాల పేద ప్రజల కోసం అహర్నిశలు పాటుపడి ,తెలంగాణ సాయుధ పోరాటం నడిపి తుపాకీ గుండ్లు సైతం తమ ఒంట్లో దిగిన మొక్కవోని ధైర్యంతో తన నమ్ముకున్న సిద్ధాంతం కోసం చివర వరకు పోరాటం కొనసాగించిన మహా గొప్ప వ్యక్తి నల్లమల గిరిప్రసాద్ అని, 1978లో భూ పోరాటాలు కొనసాగించి వేలాదిమంది జైల్లో గడిపి, చివరకు ఆయన అనుకున్న పేదలకు వేలాది ఎకరాలు భూమిని పంచిన చరిత్ర సిపిఐ పార్టీనలమల గిరిప్రసాద్ దేని అన్నారు.. సిపిఐ డిప్యూటీ ప్రధానకార్యదర్శిగా, రాజ్యసభ సభ్యులుగా కొనసాగి పేద ప్రజల కోసం వారి హక్కుల కోసం ,అనేక పోరాటాలు కొనసాగించారు. అలాంటి త్యాగదనులు పోరాటాలు మహనీయులను ఆదర్శంగా తీసుకొని యువత ,భవిష్యత్తు తరాలకు బాటలు వేయాలని, వారి ఆశయాలు కొనసాగించాలని ,వారు అన్నారు.*ఉమ్మడి ఖమ్మం జిల్లా లో పుట్టినటువంటి నల్లమల గిరిప్రసాద్ పోరాటాలకు పురిటిగడ్డగా ఎర్ర జెండాకు అడ్డాగా నేటికీ పిలవబడుతుందని వారు గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో జక్కుల రాజబాబు అధ్యక్షత వహించగా ఏఐటీయూసీ మణుగూరు మండల అధ్యక్ష కార్యదర్శులు రాయల భిక్షం జి వెంకటేశ్వర్లు కోశాధికారి కొత్తపల్లి సీతారాములు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగరాజు, కార్యవర్గ సభ్యులు కన్నెబోయిన ప్రసాద్, శ్రీకాకుళం వీరమల్లు, sd .ఉమర్, బోశెట్టి సంపత్, రాజమౌళి, భీమా తదితరులు పాల్గొని నివాళులర్పించారు.