+91 95819 05907

ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నను గెలిపిద్ధాం – మంత్రి సీతక్క..

నేటి గదర్ , మే 24, ములుగు ప్రతినిధి:

– పట్టభద్రుల ఆత్మబంధువు తీన్మార్‌ మల్లన్న

– బ్లాక్ మెలార్ల కు బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్

– అధికారము పోయిన కేటీఆర్ కు అహం పోలేదు

– కేటీఆర్ పై నిప్పులు చెరిగిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ములుగు మండలం లోని ఇంచర్ల ఎంఆర్ గార్డెన్ లో జరిగిన ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సన్నాహక సమావేశం కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు అధ్యక్షులు పైడా కుల అశోక్ గారి అధ్యక్షతన నిర్వహించగా ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సీతక్క మరియు పట్టా భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఈ సందర్భంగా మాట్లాడుతూ
శ్రీమతి సోనియా గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి పట్ట భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గా గుర్తించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రశ్నించే గొంతు పట్ట భద్రులకు ఆత్మ బంధువు తీన్మార్ మల్లన్న అని గత 10 యేండ్ల నుండి ఆనాటి దొరల పాలన సాగించిన కెసిఆర్ పై పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన పై తీ న్మార్‌ మల్లన్న తన ఛానల్‌ ద్వారా
ఎప్పటికప్పుడు ప్రజలను మొలుకోల్పి ప్రజల పక్షాన కొట్లాడిన మల్లన్న పై ఆనాటి కెసిఆర్ ప్రభుత్వం మల్లన్నపై కక్ష గట్టి జైలుకు పంపిందని ప్రజల పక్షాన నిలిచి మల్లన్న కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పట్ట భద్రులు ఆశీర్వదించాలని కేటీఆర్ కు అధికారం పోయిన అహం తగ్గలేదని ప్రజా పాలన అందిస్తున్న ప్రభుత్వం పై కారు కూతలు కుస్తున్నాడు అని రాబోయే పట్ట బద్రుల ఎన్నికల్లో బిఆర్ఎస్ కు ప్రజలే బుద్ధి చెపుతారని మంత్రి సీతక్క అన్నారు

*తీన్మార్ మల్లన్న కామెంట్స్*
మల్లన్న మాట్లాడుతూ పల్లా రాజేశ్వర్ రెడ్డి దొంగ ఓట్లతో గెలిచిన ఎమ్మల్యే అని, గతంలో ఎమ్మెల్సీగా దొంగ ఓట్ల గెలిచాడని ఆరోపించారు ఆశీర్వదించండి.. అండగా ఉంటా.పట్టభద్రులు తన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆశీర్వదించాలని, మీ ఓటును వృథా చేయకుండా ఎల్లప్పుడు అండగా ఉంటానని తీన్మార్‌‌ మల్లన్న పేర్కొన్నారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తే రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి పోతుందన్నారు. గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు లిస్ట్ ప్రకారం ఓటర్ల వద్దకు వెళ్లి ఓట్లు అడగాలన్నారు. బీఆర్‌‌ఎస్‌ ప్రచారం పెద్ద అమ్మలోళ్లు చేసినట్లు ఉన్నదని, వాళ్లను వాళ్లే కొట్టుకుంటున్నారని, ఇక బీజేపీ అభ్యర్థి ముసలాయన అని, ఆయన నల్గొండ పోయే వరకు ఎన్నికలు అయిపోతాయని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌‌ తనపై కావాలని సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాడని, ఆయన ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మడం లేదన్నారు. తనకు ఓటు వేస్తే ప్రతి కార్యకర్త తల ఎత్తుకునేలా పని చేస్తానని మల్లన్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి వర్యులు ఎంపీ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ నియోజక వర్గ ఇంచార్జీ కూచన రవళి రెడ్డి, డాక్టర్ పులి అనీల్ తో పాటు రాష్ట్ర,జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

విద్యా గిరిజనుల ప్రగతి ఆయుధం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

​పూసుకుంట, కట్కూరు అడవి బిడ్డలతో ‘హలో శుభోదయం’.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే పర్యటన నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 10: గిరిజన కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత

Read More »

అశ్వారావుపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం: మెచ్చా నాగేశ్వరరావు

​కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం.. బీఆర్ఎస్ హయాంలోనే పట్టణ ప్రగతి! నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 09: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధం

Read More »

 Don't Miss this News !