పట్టభద్రుల సమస్యల్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలి
నేటి గద్ధర్ న్యూస్, గుండాల:
నిరుద్యోగ పట్టబద్రుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రాడ్యుయేట్లు ఓటర్లంతా ఏకగ్రీవంగా తీర్మానించారు .శుక్రవారం షేక్ ఆజాద్ అధ్యక్షతన జరిగిన పట్టభద్రుల సమావేశంలో పట్టభద్రుల జేఏసీ కోఆర్డినేటర్లు టి రాంబాబు,వెంకన్న,విద్యాసాగర్, ఆల్యా, సుందర్ లు పాల్గొని మాట్లాడారు. గ్రాడ్యుయేట్స్ కేవలం ఎన్నికలప్పుడే గుర్తొస్తున్నారని అటుపిమ్మట ఎవరు పట్టించుకోవడంలేదని ఆవేదన వెలుబుచ్చారు. మారుమూల ప్రాంతమైన గుండాల మండల కేంద్రంలో గ్రంథాలయంతోపాటు, నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఎన్నికల సందర్భంలో అనేక హామీలు ఇచ్చి ఆ తర్వాత ఎవరు నిరుద్యోగులను పట్టించుకోవడంలేదని గ్రాడ్యుయేట్లు విద్యావంతులు కూలి పనులకు,హమాలీ పనులకు వెళ్ళవలసి వస్తుందని వారు వాపోయారు వెంటనే నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి రెండు లక్షల ఉద్యోగాలు లాంటి ఆకర్షణ అయినటువంటి హామీలను గుప్పించి ఆ తర్వాత నిరుద్యోగులను పట్టించుకోవడంలేదని మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన గుండాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని విద్యార్థుల ఉన్నత చదువులకు ఉపయోగపడే విధంగా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నరెష్,ప్రశాంత్, వాజీద్,రామకృష్ణ, బాలాజీ సత్యం ,రోషన్ ,నాగార్జున, శ్రీను, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.