బిజెపి అభ్యర్థిని గెలిపిస్తేనే గ్రాడ్యుయేట్స్ కి అం
★BJP మండల అధ్యక్షుడు మేకల మల్లేష్
నేటి గద్ధర్ న్యూస్ ,కారేపల్లి :
ఈనెల 27న జరగనున్న పట్టా బద్దుల ఉప ఎన్నిక MLC ఎన్నికల్లో బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కారేపల్లి మండల బిజెపి పార్టీ అధ్యక్షులు మేకల మల్లేష్ కోరారు. గత 20 సంవత్సరాలనుంచి బిజెపి పార్టీలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, బి ఆర్ ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఇద్దరు కూడా స్వలాభం కోసం పార్టీ మారారని ఆయన వారి తీరును దుయ్యపట్టారు.
రేపు జరగబోయే పట్టాభద్రుల ఉప ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరారు.
అధికార పార్టీని నిలదీసి అడిగి దమ్మున్న వ్యక్తికి, ప్రశ్నించే గొంతుక రవీందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు.