నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
జీవితంపై ఎన్నో ఆశలతో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థిని ప్రాణానికి వెల కట్టినట్లుగా ప్రచారం జరుగుతుంది.అసలు ఆరోజు ఏం జరిగింది..? పోలీస్ విచారణలో బయట పడిన నిజాలు ఏంటి..?అనే ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం దొరకలేదు.
భద్రాచలం మారుతి పారా మెడికల్అండ్ నర్సింగ్ కళాశాలలో బి ఎస్ సి నర్సింగ్ ప్రధమ సంవత్సరం చదువుతూ, కళాశాల హాస్టల్లో తీవ్ర గాయాలు పాలై కారుణ్య అను విద్యార్థిని మృతి చెందిన సంగతి విధితమే.అయితే విద్యార్థిని మరణం మిస్టరీ ఇంకా వీడలేదు.గురువారం రాత్రి కారుణ్య మరణించింది. విద్యార్థిని ఎలా చనిపోయిందో తెలపాలని, కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ, కుటుంబ అభ్యులతో పాటు విద్యార్థి, దళిత సంఘాలు శుక్రవారం ఉదయం కళాశాల దగ్గర ఆందోళనకు దిగారు. ఒకానొక దశలో కళాశాల చైర్మన్ డాక్టర్ కాంతారావుతోపాటు ఆయన కార్ డ్రైవర్ పై దాడికి యత్నించారు. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సంఘటన స్థలానికి చేరుకొని న్యాయం చేస్తామని పేర్కొన్నారు. సాయంత్రం 3.30 గంటల వరకూ ఆందోళన కొనసాగింది. కాగా కొందరు మధ్యవర్తులు కుటుంబ సభ్యులుతో చర్చలు నెరపి మృతురాలు కుటుంబానికి కళాశాల యాజమాన్యం రు.25 లక్షలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.?