నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు మే 25:
తెలంగాణ రాష్ట్ర స్థాయిలో శుక్రవారం నిర్వహించిన పాలీసెట్ ప్రవేశ పరీక్షలో మణుగూరులోని 2 సెంటర్ లలో ప్రశాంతంగా ముగిసిందని మణుగూరు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్ తెలిపారు.
ZPHS పాఠశాలలో 103 కి గాను 92 మంది, మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 300 మందికి 282 మంది విద్యార్థులు 2 సెంటర్లో మొత్తంగా 374 మంది విద్యార్థులు హాజరై పరీక్షలు రాశారని తెలిపారు.పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష నిర్విఘ్నంగా పూర్తి కావడంలో సహకరించిన వినోద్ కుమార్ అసిస్టెంట్ కో-ఆర్డినేటర్,జోగు మల్లేష్ అబ్జర్వర్, బోయిల్ల కృష్ణ అబ్జర్వర్,జి రాంబాబు అబ్జర్వర్ లుగా ఉంటూ నాకు సహకరించిన ఈ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ తెలిపారు. అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బి శ్రీనివాస్, ప్రభుత్వ కో ఎడ్యుకేషన్ హెచ్ఎం నాగజ్యోతి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు, ముఖ్యంగా ఎంట్రన్స్ పరీక్ష ముఖ్య సూచనలు ఎప్పటికప్పుడు పత్రికా ముఖంగా విద్యార్థులకు తెలియజేసిన ప్రెస్ మిత్రులకు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.